Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఢిల్లీ క్యాపిటల్స్ స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. ఇసీ వాంగ్ ఓవర్లో మరిజానే కాప్(2) బౌల్డ్ అయింది. 31 రన్స్‌కే ఢిల్లీ జట్టు కీలక వికెట్లు కోల్పోయింది. అంతకుముందు పూజా వస్త్రాకర్ అలిసే క్యాప్సే(6)ని ఔట్ చేసింది. ఆఫ్‌సైడ్‌లో కొట్టిన బంతి నేరుగా జింతిమణి కలిత చేతుల్లో పడింది. దాంతో, 24 రన్స్ వద్ద ఆ జట్టు రెండో వికెట్ పడింది. ఓపెనర్ మేగ్ లానింగ్ (17), జెమీమా రోడ్రిగ్స్ క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఇషక్ బిగ్ వికెట్ తీసింది. ఓపెనర్ షఫాలీ వర్మ(2)ను బౌల్డ్ చేసింది. 8 పరుగుల వద్ద ఢిల్లీ తొలి వికెట్ కోల్పోయింది. 7 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి ఢిల్లీ 32 పరుగులు చేసింది.
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఏడో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ మేగ్ లానింగ్ బ్యాటింగ్ తీసుకుంది. తొలి రెండు మ్యాచుల్లో రెండొందలు కొట్టిన ఆ జట్టు బలమైన ముంబైపై భారీ స్కోర్ చేస్తుందా? లేదా? అనేది చూడాలి. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రెండు మ్యాచుల్లో ఘన విజయాలు సాధించిన హర్మన్‌ప్రీత్ సేన ఢిల్లీని నిలువరిస్తుందా? అనేది ఆసక్తికరం. ఈ మ్యాచ్‌లో లానింగ్, షఫాలీ మరోసారి రాణిస్తే ఆ జట్టు భారీ స్కోర్ చేయడం ఖాయం.