Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్ : ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ వరకు కొనసాగుతున్న స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా ఆ మార్గంలో మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు మార్చి 10 నుంచి జూన్ 10వ తేదీ వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు.. ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు.