Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బెంగళూరు: ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళిని కర్ణాటకలోని రాయచూరు జిల్లా ఎన్నికల ప్రచారకర్తగా నియమించినట్లు ఆ జిల్లా పాలనాధికారి చంద్రశేఖర్ నాయక్ గురువారం వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు రాజమౌళితో చైతన్యపర్చాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్కు రాజమౌళి పేరు సిఫార్సు చేశామన్నారు. ఈ ప్రతిపాదనను రాజమౌళి ఆమోదించారని వివరించారు. రాయచూరు జిల్లా మాన్వి తాలూకా అమరేశ్వర క్యాంపులో జన్మించిన రాజమౌళి ప్రచారంతో జిల్లాలో పోలింగ్ శాతం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రచారకర్తగా నియమితులైనవారు ప్రత్యక్ష ప్రచారం, వీడియో సందేశాలు, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ఓటరు చైతన్యానికి కృషి చేస్తారు.