Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:50 గంటల సమయంలో సెన్సెక్స్ 817 పాయింట్ల నష్టంతో 58,989 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 232 పాయింట్లు నష్టపోయి 17,386 దగ్గర కొనసాగుతోంది. అదానీ ఎంటర్ ప్రైజెస్,హెచ్డీఎఫ్సీ,హెచ్డీఎఫ్సీ బ్యాంక్, లార్సెన్, అపోలో హాస్పిటల్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. టాటా మోటార్స్, ఎయిర్ టెల్, బజాజ్ ఆటో, మారుతి సుజికి, బ్రిటానియా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.