Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బీజింగ్
చైనా అధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్ సరికొత్త చరిత్ర లిఖించారు. ముచ్చటగా మూడోసారి దేశాధ్యక్ష పదవిని చేపట్టారు. మరో ఐదేళ్ల పాటు జిన్‌పింగ్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తూ చైనా పార్లమెంట్ శుక్రవారం ఆమోదముద్ర వేసింది. దీంతో డ్రాగన్ దేశానికి ఆయన జీవితకాల అధినాయకుడిగా ఉండేందుకు మార్గం లభించినట్లైంది. గతేడాది అక్టోబరులో జరిగిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) కాంగ్రెస్ సమావేశాల్లో 69 ఏళ్ల జిన్‌పింగ్‌ను మరోసారి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న విషయం తెలిసిందే.
దీంతో సీపీసీ వ్యవస్థాపకుడు మావో తర్వాత మూడోసారి పార్టీ పగ్గాలు అందుకున్న తొలి నేతగా జిన్‌పింగ్ ఘనత సాధించారు. మొత్తం 2,950 మందికి పైగా సభ్యులు ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నిక తర్వాత.. జిన్‌పింగ్ రాజ్యాంగంపై ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు. ఇక జిన్‌పింగ్ అత్యంత సన్నిహితుడు హన్ ఝెంగ్‌ను దేశ ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.