Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చేస్తున్న దీక్షలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ తరుణంలో ఆమె మాట్లాడుతూ మహిళా బిల్లుకు మద్దతు ప్రకటించిన బీజేపీకి అవకాశం ఇచ్చి ఎనిమిదేండ్లు దాటిపోయిందని, ఇంకా బిల్లు మాత్రం లోక్‌సభ ముందుకు రాలేదని విమర్శించారు.
ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేయాలని డిమాండ్ చేశారు. సృష్టికి మూలమైన మహిళ తన కోసం ఇంకా పోరాడటం శోచనీయమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తమ పదవులు కాపాడుకోవడానికే మహిళా రిజర్వేషన్ బిల్లును రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. మహిళలను వంటిల్లు దాటకుండా చూడాలనే భావన సరైనది కాదన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వం బంజారాలకు స్వర్ణయుగమని, బంజారాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించారని వెల్లడించారు.