Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
ఉద్యోగాలు ఇప్పించేందుకు కొంతమంది అభ్యర్థుల నుంచి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం భూములు తీసుకుందన్న అభియోగాల కేసులో ఈడీ సోదాలు చేపట్టింది. కొద్దిరోజుల క్రితం లాలూ, ఆయన భార్య రబ్రీదేవిని సీబీఐ ప్రశ్నించింది. తాజా తనిఖీల్లో ఆయన కుమారుడు, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ఢిల్లీ ఇల్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బిహార్, ఉత్తర్ప్రదేశ్, ముంబయిలోని ఆయన కుటుంబానికి చెందిన పదులకుపైగా ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. లాలూ సన్నిహితుడు, ఎమ్మెల్యే అబు దొజానా ఇంట్లో తనిఖీలు చేపట్టారు.