Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ భవన్లో మీడియాతో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ జర్నలిస్టులు, మీడియా సంస్థలంటే మాకు గౌరవం ఉందని అన్నారు. కానీ మీడియా యాజమాన్యాల గొంతు పట్టుకుని ఈడీ, సీబీఐ కేసులు వేస్తున్నాయన్నారు. వాళ్ళు ఏం చేయగలరు? మన రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రభపై కేసులు పెట్టాయి. ఎవరినీ వదిలిపెట్టడంలేదు. మీకు ధైర్యం లేకపోవచ్చు మాకు ఉంది. నిజాలు చూపించే సత్తా మీకు లేకపోవచ్చు మాకూ ఉంది.
వాస్తవాలను తప్పకుండా చూపిస్తాం. ప్రజల ముందు వారిని నగ్నంగా నిలబెట్టడం మన బాధ్యత అని కేటీఆర్ స్పష్టం చేశారు. మద్య నిషేధం ఉన్న గుజరాత్లో మద్యం తాగి 42 మంది చనిపోయారు. ఇది స్కామా.. స్కీమా.. ఏమంటారో మీరే చెప్పండి అన్నారు. లేక అది మోడీ స్కీమా..? దాని గురించి ఎందుకు మాట్లాడరు? అది అప్రజాస్వామికం కాదా? అని మీడియాకు ప్రశ్నల వర్షం కురిపించారు మంత్రి. ఈ దేశంలో ఎవరు ఆడించినట్లు పత్రికలు ఆడుతున్నాయని కేటీఆర్ నిలదీశారు.