Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
ఏపీలో 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 14 నుంచి జరగాల్సిన ఫిజికల్ ఈవెంట్స్(పీఎంటీ/పీఈటీ) వాయిదా పడ్డాయి. అసెంబ్లీ సమావేశాలు, ఎమ్మెల్సీ ఎన్నికల తరుణంలో ఈ ఈవెంట్స్‌ను వాయిదా వేస్తున్నట్టు పోలీస్ నియామక మండలి ఓ ప్రకటనలో తెలిపింది. కొత్త తేదీలను తర్వాత ప్రకటించనున్నట్టు వెల్లడించింది. తాజా అప్డేట్స్ కోసం తమ వెబ్‌సైట్‌ను చెక్ చేసుకోవాలని రిక్రూట్మెంట్ బోర్డు ఛైర్మన్ మనీశ్ కుమార్ సిన్హా విజ్ఞప్తి చేశారు. మరోవైపు, ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించి ఫేజ్-2 పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఫిజికల్ ఈవెంట్స్‌కు హాజరయ్యేందుకు ఇటీవలే హాల్ టిక్కెట్లను వెబ్సైట్లో ఉంచారు.