Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టపోయాయి. ఉదయం భారీ నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. బ్యాంకింగ్, స్థిరాస్తి రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు కూడా సూచీలపై ప్రభావం చూపాయి. అధిక వెయిటేజీ ఉన్న హెచ్డీఎఫ్సీ జంట షేర్లు, రిలయన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ వంటి షేర్లు నష్టపోవడమూ ప్రతికూల ప్రభావం చూపింది.
ఉదయం సెన్సెక్స్ 59,259.83 దగ్గర నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 58,884.98 దగ్గర కనిష్ఠాన్ని తాకింది. చివరకు 671.15 పాయింట్ల నష్టంతో 59,135.13 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 17,443.80 దగ్గర ప్రారంభమై 17,324.35 దగ్గర కనిష్ఠానికి చేరింది. చివరకు 176.70 పాయింట్లు నష్టపోయి 17,412.90 దగ్గర ముగిసింది.