Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : వివేకా హత్య కేసులో సీబీఐ తనపై తీవ్ర చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. అవినాశ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి అవినాశ్ రెడ్డిని సోమవారం వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. కేసు పూర్తి వివరాలు సోమవారం సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. అవినాశ్ విచారణను వీడియో రికార్డింగ్ చేస్తున్నామని సీబీఐ న్యాయవాది తెలిపారు. అందుకు కోర్టు స్పందిస్తూ... వీడియో రికార్డింగ్ ఏ దశలో ఉందో చెప్పాలని సీబీఐని ఆదేశించింది. కాగా, వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి నేడు హైదరాబాదులోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఆయనను సీబీఐ విచారించడం ఇది మూడోసారి.