Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తలకు తీవ్ర గాయం అవ్వడంతో అక్కడికక్కడే మృతి
నవతెలంగాణ - కంటేశ్వర్
నగరంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో చంద్రశేఖర్ కాలనీ చౌరస్తాలో గల హెచ్డిఎఫ్సి, ఎస్బిఐ ఎటిఎం వద్ద
ఓ వ్యక్తి మృతి చెందినట్లు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ లింబాద్రి తెలిపారు. ఎస్సై లింబాద్రి తెలిపిన వివరాల ప్రకారం గాజులపేటకు చెందిన కుకునూరు రవి (32) సంవత్సరాలు రోజులాగే ఉదయం బట్టల షాపుకు పనికి వచ్చి మధ్యాహ్నం అందాజా 12 గంటలకు ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకొని పక్కనే ఉన్న మెడికల్ లో మెడిసిన్ తీసుకొని చేతిలో నొప్పి వస్తుందని చెప్పి పక్కకు తిరిగేసరికి ఒకసారిగా కుప్పకూలాడు. దీంతో తలకు తీవ్రంగా గాయం అవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తికి హార్ట్ ఎటాక్ తో మృతి చెందినట్లు తెలుస్తుంది. భార్యలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ లింబాద్రి తెలిపారు.