Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : జర్మనీలోని హాంబర్గ్ నగరంలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. మృతుల్లో ఓ గర్భవతి కూడా ఉన్నారు. యెహోవా విట్నెస్ ప్రార్థనా స్థలంలో కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు వారు వెల్లడించారు. దాడికి తెగబడ్డ వ్యక్తి కూడా.. మృతుల్లో ఉన్నట్లు తెలిపారు. కాల్పులకు పాల్పడ్డ వ్యక్తిని 35 ఏళ్ల ఫిలిప్ ఎఫ్‌గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అతడు జర్మన్ జాతీయుడేనని వెల్లడించారు. ఈ దాడిలో అతడు 100 రౌండ్లకు పైగా కాల్పులు జరిపినట్లు వివరించారు. కాల్పుల్లో మొత్తం ఎనిమిది మంది గాయపడ్డారని.. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. నిందితుడికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లుగా.. ఎటువంటి ఆధారాలు లేవని వారు వెల్లడించారు. 'గురువారం రాత్రి ఎనిమిది గంటల తరువాత మాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. మేము అక్కడకు చేరుకునే సరికే.. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. మరికొంత మంది మృతి చెందారు. వెంటనే ఘటనకు పాల్పడ్డ వ్యక్తిని అంతమొందించాం.' అని పోలీసులు తెలిపారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టినట్లు వారు వెల్లడించారు. హుటాహుటిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.