Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కామారెడ్డి
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజహరుద్దీన్ కామారెడ్డి జిల్లా పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధిష్ఠానం అవకాశమిస్తే కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. లింగంపేటలో శుక్రవారం అజహరుద్దీన్ సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ తరుణంలో మీడియాతో మాట్లాడిన ఆయన కామారెడ్డి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తానని అన్నారు.