Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
భారతీయ సమాజంలో స్త్రీ విద్య కోసం శ్రమించిన తొలి ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి ఫూలే అని మెదక్ అదనపు జిల్లా కలెక్టర్ ఎనుగు నర్సింహారెడ్డి కొమనియాడారు. తెలుగు యూనివర్సిటీ ప్రాంగణంలో టీయు స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సావిత్రి బాయి ఫూలే నివాళీ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న వారు సావిత్రి బాయి ఫూలే భారతీయ స్త్రీ సాధికారతకు చిహ్నం అని అన్నారు. సామాజిక సేవలో, సాహిత్య కృషిలో ఎనలేని సేవలుఅందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మంగి వేణుగోపాల్, కేపి అశోక్ కుమార్, స్టడీ సర్కిల్ అరవింద్, జితెందర్, పవిత్ర, ప్రవీణ్, అరుణజ్యోతి, కళ్యాణి, మనోహర్, చరణ్, సంజివ్, మౌనిక. వైష్ణవి, వాగ్దేవి తదితరులు పాల్గొన్నారు.