Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మహిళల ప్రీమియర్ లీగ్ ఎనిమిదో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటి వరకూ ఆ జట్టు ఖాతా తెరవలేదు. ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓటములతో పాయింట్ల పట్టికలో అడుగున ఉంది. స్మృతి మంధాన, ఎలీసా పెర్రీ, సోఫీ డెవినే, రీచా ఘోష్ వంటి స్టార్టు ఉన్నా కూడా ఆ జట్టు భారీ స్కోర్ చేయలేకపోతోంది.
ఆర్సీబీ జట్టు : స్మృతి మంధాన (కెప్టెన్), రీచా ఘోష్ (వికెట్ కీపర్), సోఫీ డెవినే, హీథర్ నైట్, దిశా కసాత్, ఎలిసే పెర్రీ, కనికా అహుజా, అషా శోభన, ప్రీతీ బోస్, మేగన్ షట్, రేణుకా ఠాకూర్.
యూపీ వారియర్స్ జట్టు : అలిసా హేలీ(వికెట్ కీపర్), శ్వేతా షెరావత్, కిరణ్ నవ్‌గిరే, తహ్లియా మెక్‌గ్రాత్, దీప్తీ శర్మ, సిమ్రాన్ షస్త్రక్, దేవికా వైద్యా, సోఫీ ఎక్లెస్టోన్, షబ్నిం ఇస్మాయిల్, అంజలీ సర్వానీ, రాజేశ్వరీ గైక్వాడ్.