Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిన్న అరెస్ట్ చేసిన మనీశ్ సిసోడియాను ఈడీ అధికారులు నేడు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈడీ విజ్ఞప్తి మేరకు న్యాయస్థానం సిసోడియాకు వారం రోజుల కస్టడీ విధించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సిసోడియాను ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేయడం తెలిసిందే. అయితే ఈ కేసులో మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో, ఈడీ అధికారులు సిసోడియాను నిన్న అదుపులోకి తీసుకున్నారు. సిసోడియాను కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలని ఈడీ కోర్టుకు విన్నవించింది. ఈడీ విజ్ఞప్తికి కోర్టు సమ్మతిస్తూ, సిసోడియాను కస్టడీకి అప్పగించింది. అనంతరం, తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది.