Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : చదువుకునే సమయంలో అన్ని తరగతుల్లో ఫస్ట్ ర్యాంకు, ఆ తర్వాత గ్రూప్-1, 2 కొలువు సాధించా, ఆంధ్రాబ్యాంక్‌లో ఆఫీసర్ ఉద్యోగం వచ్చిందని ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. ప్రతి పోటీ పరీక్షలో ఉద్యోగం సాధించానని, అయినా ఉద్యోగం వద్దనుకొని బీసీ కులాల అభ్యున్నతికి కృషి చేసేందుకు ఉద్యమిస్తున్నానని ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మం నగరంలోని తెలంగాణ రాష్ట్ర బీసీ స్టడీ సర్కిల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు కృషి చేయడంతోపాటు సమాజాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. విద్యార్థులు శిక్షణ పొందేందుకు ఇప్పుడు భవనాలు, అన్ని రకాల సౌకర్యాలు సమకూరాయని ఆర్ కృష్ణయ్య తెలిపారు.