Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదాబారాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ మూడు జిల్లాల పరిధిలోని మద్యం దుకాణాలను శనివారం సాయంత్రం 4 గంటల నుంచి సోమవారం సాయంత్రం 4 గంటల వరకు మూసేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎక్సైజ్ శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.