Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కామ్లో శనివారం ఈడీ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరుకానున్నారు. ఢిల్లీ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులోని ఈడీ హెడ్ ఆఫీసుకు ఉదయం 10:30 గంటల వరకు ఆమె చేరుకోనున్నారు. 11 గంటలకు కవితను అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ కేసులో హైదరాబాద్కు చెందిన లిక్కర్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లై, బ్రిండ్కో సేల్స్ డైరెక్టర్ అమన్ దీప్ సింగ్ ధాల్, ఆడిటర్ బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా కవితకు ఈడీ ఈ నెల 8న నోటీసులు ఇచ్చింది. 9న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. తనకు 15 వరకు టైమ్ ఇవ్వాలని కవిత కోరగా, ఈడీ నుంచి రిప్లై రాలేదు. దీంతో 11న వస్తానని రిక్వెస్ట్ పంపి, బుధవారం సాయంత్రం ఆమె ఢిల్లీకి వచ్చారు. ఇందుకు ఈడీ అధికారులు అంగీకరించడంతో శనివారం కవిత విచారణకు హాజరుకానున్నారు. కాగా, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగే చాన్స్ ఉండడంతో ఈడీ ఆఫీసుకు వెళ్లే రూట్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.