Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఝార్ఖండ్‌లోని జంషెద్‌పుర్‌లో దారుణం జరిగింది. మానసిక స్థితి సరిగా లేని ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. అనంతరం భర్త మృతదేహాన్ని అయిదు రోజులపాటు ఇంట్లోనే ఉంచింది. దుర్వాసన రావడంతో స్థానికులు ఉలిదిహ్ పోలీస్‌స్టేషనులో ఫిర్యాదు చేయగా.. విషయం బయటపడింది. మృతుడిని సుభాష్ కాలనీకి చెందిన అమర్నాథ్ సింగ్‌గా గుర్తించారు. ఈయన స్థిరాస్తి వ్యాపారం చేసేవాడు. భార్య మీరా మానసికస్థితి సరిగా లేదు. దీంతో తరచూ గొడవలు జరుగుతుండేవి. చాలాసార్లు మీరా ఇంట్లోని వస్తువులను బయటకు విసిరేసేది. ఈ క్రమంలో అమర్నాథ్ అదృశ్యం కావడంతోపాటు ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చింది. ఇంట్లోకి ఎవరూ రాకుండా మీరా ఇంటి కంచెకు కరెంటు పెట్టింది. దీంతో స్థానికులు పుణెలో ఉంటున్న అమర్నాథ్ కుమారుడికి ఫోనులో విషయం తెలియజేశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందడంతో మీరాను అదుపులోకి తీసుకొని, అమర్నాథ్ మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.