Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : బెంగళూరు మెట్రో ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సులో మంటలు చెలరేగిన ప్రమాదంలో కండక్టర్ సజీవదహనమయ్యాడు. లింగదీరనహళ్లి బస్టాండ్ వద్ద ఆగి ఉన్న బస్సులో శుక్రవారం తెల్లవారు జామున ప్రమాదం జరిగింది. గురువారం రాత్రి పొద్దుపోయాక కేఏ 57 ఎఫ్ 2069 నంబరు గల బస్సు బస్టాండ్‌కు చేరుకోగా తెల్లవారు జామున బయలుదేరాల్సి ఉండేది. నైట్‌హాల్ట్ సర్వీసు కావడంతో బస్సులోనే డ్రైవర్ ప్రకాష్, కండెక్టర్ ముత్తయ్య నిద్రించారు. డ్రైవర్ ప్రకాష్ కాలకృత్యాలు తీర్చుకునేందుకు నాలుగు గంటల వేళ బస్సు దిగి కొంత దూరం వెళ్లాడు. అంతలోనే బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కాసేపట్లోనే బస్సులో పూర్తిగా మంటలు తీవ్రమయ్యాయి. బస్సులో నిద్రిస్తున్న కండక్టర్ ముత్తయ్య (45) సజీవదహనమయ్యాడు. బస్సులో మంటలు ఎలా చెలరేగాయనే కోణంలో పరిశీలిస్తున్నారు. బస్సు ప్రమాద విషయం తెలియగానే ఉన్నతాధికారులు, పోలీసులు, అగ్నిమాపకశాఖ ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. రోజూ వేలాది బస్సులు నైట్ సర్వీసులు ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. ఇలాంటి ప్రమాదాలు జరిగితే సిబ్బంది ఏం కావాలని అన్ని కార్పొరేషన్ ఉద్యోగులు మండిపడుతున్నారు.