Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : యాపిల్.. ఐఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. 14 సిరీస్ లో కొత్త కలర్ ని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఐఫోన్ 5, ఐఫోన్ 5సీల్లో తీసుకొచ్చిన పసుపు కలర్ ని మళ్లీ ఇప్పుడు ఐఫోన్ 14 సిరీసుల్లో తీసుకురాబోతోంది. అయితే, ఈ రంగు కాస్త బనానా ఎల్లో (అరటి పసుపును) ను పోలి ఉంటుందని తెలిపింది. వీటిని త్వరలో భారతీయ మార్కెట్లోకి తీసుకు రానున్నట్లు తెలిపింది. అయితే, ఐఫోన్ 14 సిరీస్ పాత ధర కాకుండా ఈ స్పెషల్ కలర్ కు ధర పెంచింది. రూ.79,900 ఉన్న ఫోన్ ధరను రూ.80,900 లకు పెంచింది. ఈ నిర్ణయంపై టెక్ వర్గాలు రకరకాల కామెంట్స్ ఇస్తున్నాయి. కేవలం కలర్ మార్చి పదివేల రూపాయలు ధర పెంచడం ఏంటని ట్రోల్ చేస్తున్నారు.