Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : బలగం.. గత వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తుంది. తెలంగాణ సంసృతి, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను వేణు తెరమీద ఆవిష్కరించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కమెడియన్ వేణులో ఇంత మంచి దర్శకుడు దాగున్నాడా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ప్రియదర్శి తన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కర తమ పాత్రకు న్యాయం చేశారు. ఇటీవలే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం లాభాల బాట పట్టింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా బృందాన్ని చిరు అభినందించాడు. బలగం సినిమా చాలా బాగుందని చిరంజీవి అన్నాడు. వేణు సినిమాను చాలా అద్భుతంగా తీశాడని కొనియాడాడు. తెలంగాణ సంసృతిని బాగా చూపించావని వేణును అభినందించాడు. జబర్దస్త్‌లో తన స్కిట్ చూశానని, ఒగ్గు కథలు వంటివి బాగా చేశాడని వేణును ప్రశంసించాడు. అలాగే నటీనటులు ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్‌ను అభినందించాడు. చిత్రయూనిట్‌ను శాల్వాతో సత్కరించాడు. ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని చిరు అన్నాడు. మెగాస్టార్ బలగం సినిమా గురించి మాట్లాడటంతో చిత్రయూనిట్ సంతోషానికి అవదుల్లేకుండా పోయాయి.