Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
రైల్వే ఉద్యోగాల కుంభకోణం కేసులో దర్యాప్తు సంస్థలు విచారణ ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కు చెందిన నివాసంలో ఈడీ నిన్న సోదాలు జరిపిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో విచారణకు రావాలంటూ సీబీఐ శనివారం ఆయనకు సమన్లు జారీ చేసింది. అయితే, నేడు తాను హాజరుకాలేనని తేజస్వీ చెప్పినట్లు తెలుస్తోంది. గర్భిణీ అయిన తన భార్య ప్రస్తుతం అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న కారణంగా విచారణకు రాలేనని సీబీఐకి ఆయన సమాచారమిచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
రైల్వే ఉద్యోగాల కుంభకోణంలో ఆ శాఖ మాజీ మంత్రి లాలూప్రసాద్ బంధువులు, ఆర్జేడీ నేతల ఇళ్లు, ప్రాంగణాల్లో ఈడీ శుక్రవారం సోదాలు నిర్వహించింది. దక్షిణ ఢిల్లీలో తేజస్వీ యాదవ్ బసచేసిన ఒక నివాసంలోనూ ఈ సోదాలు జరిగాయి. ఆ తనిఖీల్లో భాగంగా గర్భిణీ అయిన తేజస్వీ భార్యను 15 గంటల పాటు ప్రశ్నల పేరుతో వేధించినట్లు ఆర్జేడీ ఆరోపించింది. దీంతో ఆమె రక్తపోటు పెరిగి అనారోగ్యానికి గురయ్యారని, ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నారని పేర్కొంది. ఈ తరుణంలో తేజస్వీ యాదవ్కు సీబీఐ సమన్లు జారీ చేయడంతో ఆయన రాలేనని చెప్పినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి