Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారంటూ అభియోగాలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ తరుణంలో బండి సంజయ్‌కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయనుంది. మహిళల గౌరవాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయని మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర మహిళా కమిషన్ వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించనుంది. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని డీజీపీని మహిళా కమిషన్ విచారణకు ఆదేశించింది.