Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ నేత బండి సంజయ్ వ్యాఖ్యలు హర్షణీయం కాదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ సంస్కారం మరిచి మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ మహిళలతో పాటు, దేశంలో ఉన్న మహిళలందరికీ బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత విమర్శలు సరికాదు గౌరవప్రదంగా మాట్లాడాలని సూచించారు. మోడీ దొంగ దెబ్బ తీయాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీలో మహిళలకు ఎక్కడ గౌరవం ఉందని ప్రశ్నించారు. కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. దర్యాప్తు సంస్థలను ఊసిగొల్పుతున్నారని మంత్రి మండిపడ్డారు.