Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నార్సింగ్ పూర్ లో దారుణం చేటుచేసుకుంది. మద్యం కారణంగా ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వేధింపుల నుంచి తప్పించుకునేందుకు భార్య అనిత కౌరవ్ (38), కుమారుడు సెజల్ (19), కుమార్తె షాని (16) ఈ నిర్ణయం తీసుకున్నారని పోలీసులు వెల్లడించారు. నార్సింగ్ పూర్ జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న గదర్వారా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ విషాదం చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో రైల్వే ట్రాక్ పై 3 మృతదేహాలు పడి ఉన్నట్లు సమాచారం వచ్చిందని వెల్లడించారు. ఈ క్రమంలో చనిపోయిన కుమారుడి జేబులో నుంచి సూసైడ్ నోట్ బయటపడింది. తన తండ్రి తరచూ తాగి వచ్చి తమను ఇబ్బంది పెట్టడం వల్లే ముగ్గురం ఆత్మహత్య చేసుకున్నామని అందులో ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని తండ్రిని అరెస్ట్ చేశారు.