Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - గువాహటి
ట్రాన్స్జెండర్ల సాధికారత కోసం ఈశాన్య సరిహద్దు రైల్వే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ తరుణంలో గువాహటి రైల్వే స్టేషన్లో కొత్తగా ఏర్పాటు చేసిన ట్రాన్స్జెండర్ల టీ స్టాల్‌ను ఎన్ఎఫ్ఆర్ జనరల్ మేనేజర్ అన్షుల్ గుప్తా శనివారం ప్రారంభించారు.
టీ స్టాల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఎన్ఎఫ్ఆర్ జనరల్ మేనేజర్ అన్షుల్ గుప్తా మాట్లాడుతూ ట్రాన్స్జెండర్ల సాధికారత కోసం ఎన్ఎఫ్ఆర్ తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. అందుకు కృషి చేస్తుందన్నారు. ఇతర రైల్వే స్టేషన్లలోనూ ట్రాన్స్జెండర్ల టీ స్టాల్స్‌ను ప్రారంభించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తామన్నారు.