Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఆ పార్టీ నాయకుడు ఆశిష్ యాదవ్ ఆధ్వర్యంలో కార్యాలయం ముందు బైఠాయించిన శ్రేణులు ప్రధాని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్, ఇతర నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదని, తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పకపోతే బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ తరుణంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్‌లోని వివిధ పోలీస్ స్టేషన్లలో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్, పంజాగుట్ట, ఎస్సార్‌నగర్, ముషీరాబాద్, వనస్థలిపురం, కూకట్పల్లి ఠాణాలతో పాటు పలు పోలీస్ స్టేషన్లలో బండి సంజయ్‌పై ఒకే తరహా ఫిర్యాదులు రావడంతో పోలీసులు న్యాయ సలహా తీసుకుంటున్నారు.