Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అహ్మదాబాద్
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా మూడు వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (59; 128 బంతుల్లో 5 ఫోర్లు బ్యాటింగ్), రవీంద్ర జడేజా (16; 54 బంతుల్లో 1 సిక్స్ బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ ఇంకా 191 పరుగుల వెనుకంజలో ఉంది. శుభ్మన్ గిల్ (128; 235 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్) శతకం బాదగా ఛెతేశ్వర్ పుజారా (42) చేశాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లైయన్, మాథ్యూ కునెమన్, టాడ్ మార్ఫీ తలో వికెట్ పడగొట్టారు.