Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
డీసీడబ్ల్యూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ స్వాతి మాలివాల్ పాల్గోన్నారు. ఈ తరుణంలో ఆమె మాట్లాడుతూ బాల్యంలో తన తండ్రి తనను లైంగికంగా వేధించాడంటూ.. నా 4వ తరగతి వరకు మేం ఆయనతో కలిసి ఉన్నాం. నన్ను ఆయన అకారణంగా కొట్టేవారు. కొన్నిసార్లు రక్తం వచ్చేది. ఆయన ఇంట్లోకి వస్తే చాలా భయమేసేది. ఎన్నోసార్లు మంచం కింద దాక్కున్నా. ఆ సమయంలో మహిళల హక్కుల కోసం ఏం చేయాలనేదానిపై ఆలోచించేదాన్ని. ఈ క్రమంలోనే దుర్మార్గాలకు పాల్పడేవారికి గుణపాఠం చెప్పాలనుకున్నా అని స్వాతి మాలివాల్ తెలిపారు.
జీవితంలో దారుణాలను ఎదుర్కొన్నవారు.. ఇతరుల బాధను మరింత అర్థం చేసుకోగలరు. ఈ క్రమంలోనే వ్యవస్థనూ మార్చగలరు. నా విషయంలో ఇదే జరిగింది. ఈ రోజు అవార్డు పొందినవారిలో చాలావరకు మహిళలది దాదాపు ఇదే తరహా పరిస్థితి. తల్లి, పిన్ని ఇతర కుటుంబ సభ్యుల సహకారం లేకపోతే అప్పటి అకృత్యాల జ్ఞాపకాల నుంచి బయటపడేదాన్నే కాదు అని అన్నారు.