Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
సేమ్ సెక్స్ మ్యారేజ్ కు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరపబోతోంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరుపుతుందని సుప్రీంకోర్టు కాజ్ లిస్ట్ తెలిపింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పర్దీవాలా కూడా ఉన్నారు. స్త్రీని మరొక స్త్రీ పెళ్లి చేసుకున్నపుడు, పురుషుడు మరొక పురుషుడిని వివాహం చేసుకున్నపుడు ఆ వివాహానికి లీగల్ వ్యాలిడిటీ (చట్టపరమైన చెల్లుబాటు) కల్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టు సహా వివిధ హైకోర్టులలో దాఖలైన పిటిషన్లను కలిపి, సుప్రీంకోర్టు జనవరి 6న తనకు బదిలీ చేసుకుంది.