Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
డబ్ల్యూపీఎల్ లో వరుస ఓటములతో ఆర్సీబీ జట్టు తీవ్ర నిరాశ పరుస్తోంది. స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ ఇప్పటి వరకూ ఈ జట్టు బోణీ కొట్టలేకపోయింది. శుక్రవారం యూపీ వారియర్స్‌తో జరిగిన నాలుగో మ్యాచ్‌లోనూ 10 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది స్మృతి మంధాన జట్టు.
ఈ తరుణంలో స్మృతి స్పందిస్తూ దీనికి తనదే బాధ్యత అంటూ పేర్కొంది. గత నాలుగు మ్యాచ్‌ల్లో మేం బాగానే ప్రారంభిస్తున్నప్పటికీ వికెట్లను వెంటవెంటనే కోల్పోతున్నాం. ఓటములకు బాధ్యత నేనే తీసుకుంటా. టాప్ ఆర్డర్ బ్యాటర్‌గా స్కోరు బోర్డుపై పరుగులు ఉంచాలి. అప్పుడే బౌలర్లకు పోరాడేందుకు వీలుంటుంది అని అన్నారు.