Two heavy vehicles collided near Ganesh Ghat before catching fire. #dhar pic.twitter.com/LqpbO1i9YP
— JD Jansampark Indore (@jdjsindore) March 11, 2023
Authorization
Two heavy vehicles collided near Ganesh Ghat before catching fire. #dhar pic.twitter.com/LqpbO1i9YP
— JD Jansampark Indore (@jdjsindore) March 11, 2023
నవతెలంగాణ - భోపాల్
మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక హైవేపై మూడు కంటైనర్ లారీలు ఢీకొన్నాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మంటల్లో కాలి సజీవ దహనమయ్యారు. మరో వ్యక్తికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. ముంబై-ఆగ్రా నాలుగు లేన్ల జాతీయ రహదారిలోని గణేష్ ఘాట్ వద్ద శనివారం మూడు కంటైనర్ లారీలు ఢీకొన్నాయి. ముంబై వైపు వెళ్తున్న లారీ బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో రోడ్డు డివైడర్ను దాటి పక్కనున్న లేన్లోకి దూసుకెళ్లింది. ఎదురుగా వస్తున్న మరో రెండు లారీలను అది ఢీకొట్టింది. కార్లు, గ్రానైట్, ఇతర పార్సిల్ లోడ్ ఉన్న లారీలకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఢీకొట్టిన లారీ హైవేపై బొల్తాపడింది. దీంతో కొంతసేపు ఆ మార్గం మూసుకుపోయింది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పి వేశారు. రెండు లారీలకు చెందిన ఇద్దరు వ్యక్తులు మంటల్లో కాలిపోయి సజీవ దహనమయ్యారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమీపంలోని ధన్మోద్ ప్రభుత్వ ఆస్పత్రికి అతడ్ని తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.