Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లి
భారతీయ జీవిత బీమా సంస్థ తాత్కాలిక చైర్మన్గా సిద్ధార్థ మహంతిని కేంద్రం నియమించింది. ఈనెల 14 నుంచి మూడు నెలల పాటు ఎల్ఐసీ చైర్మన్గా సిద్ధార్థ మహంతి బాధ్యతలు నిర్వర్తిస్తారని సమాచారం. ప్రస్తుతం ఎల్ఐసీ మేనేజింగ్ డైరెక్టర్గా సిద్ధార్థ మహంతి పని చేస్తున్నారు. ప్రస్తుతం ఎల్ఐసీ చైర్మన్గా ఉన్న ఎంఆర్ కుమార్ పదవీ కాలం ఈ నెల 13తో ముగియనున్నది. ఆయనకు పొడిగింపు ఇవ్వకపోవడంతో సిద్ధార్థ మహంతిని తాత్కాలిక చైర్మన్గా కేంద్రం నియమించారు.
2021 జనవరి 31న ఎల్ఐసీ ఎండీగా రిటైర్ అయిన టీసీ సుశీల్ కుమార్ స్థానే సిద్ధాంత మహంతిని ఎల్ఐసీ ఎండీగా కేంద్రం నియమించింది. అంతకుముందు సిద్ధార్థ మహంతి ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) కం మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా పని చేస్తున్నారు. ఈ పదవిలో సిద్ధార్థ మహంతి 2023 జూన్ నెలాఖరు వరకు కొనసాగుతారు.