Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
రాజ్యసభలో తమ పార్టీ డిప్యూటీ నేతగా ప్రమోద్ తివారీని, విప్‌గా రజనీ పాటిల్‌ను నియమిస్తున్నట్లు కాంగ్రెస్ శనివారం ప్రకటించింది. నేతలు ఆనంద్ శర్మ పదవీవిరమణ, రాజీవ్ సతావ్ మరణంతో ఏర్పడిన ఖాళీల్లో కాంగ్రెస్ తాజా నియామకాలను చేపట్టింది. తమ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఈ మేరకు ఆమోదం తెలిపారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్విటర్ ద్వారి వెల్లడించారు.
ఈ నియామకాలకు సంబంధించిన లేఖను రాజ్యసభ చైర్మన్‌కు పంపించినట్లు స్పష్టం చేశారు. తివారీ ఇప్పటివరకూ 3సార్లు రాజ్యసభ ఎంపీగా పనిచేయగా, పాటిల్ రెండుసార్లు ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం రాజ్యసభలో కాంగ్రెస్ సభాపక్షనేతగా మల్లికార్జున్ ఖర్గే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.