Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని, తన రాజీనామాను ఆమోదించాలంటూ కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడికి లేఖ రాశారు. కిరణ్ కుమార్ బీజేపీలో చేరతారంటూ ఇటీవల కథనాలు వచ్చాయి. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పడంతో ఆ కథనాలకు బలం చేకూరుతోంది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రి. రాష్ట్ర విభజన సమయంలో జై సమైక్యాంధ్ర పార్టీ ఏర్పాటు చేశారు. 2014 ఎన్నికల తర్వాత ఆయన రాజకీయంగా తెరమరుగయ్యారు.