Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రతిష్టాత్మక ఆస్కార్ వేడుకలు లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో ఘనంగా ప్రారంభం అయ్యాయి. 95వ ఆస్కార్ అవార్డుల వేడుకుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ తారలు హాజరయ్యారు. విభాగాల వారీగా అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌తో ఆస్కార్ అవార్డులు మొదలయ్యాయి. 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్' సినిమాకు గానూ ఉత్తమ సహాయ నటుడిగా కే హ్యూ క్వాన్ ఆస్కార్ గెలుచుకున్నాడు. ఉత్తమ సహాయనటిగా జామీ లీ కర్టిస్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్) ఆస్కార్ గెలుచుకుంది. బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్‌గా 'పినాకియో'ను ఆస్కార్ వరించింది. ఉత్తమ డాక్యుమెంటరీ ఫిలిం విభాగంలో 'నావల్నీ' కి ఆస్కార్ అవార్డు వచ్చింది.