Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ రాజేంద్రనగర్లోని కట్టెల గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎక్కువ మొత్తంలో కట్టెలు నిల్వ ఉండటంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తు ప్రమాదం జరిగిన సమయంలో గోదాంలో ఎవరూ లేకపోవడంతో పెను ముప్పు తప్పింది. అగ్నిమాపక సిబ్బంది 8 శకటాలతో సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. కట్టెల గోదాంలో ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.