Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో 95వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరగుతుంది. బెస్ట్ సినిమాటోగ్రాఫర్ విభాగంలో జేమ్స్ ఫ్రెండ్ ఆస్కార్ గెలుచుకున్నాడు. 'ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్' సినిమాకు గానూ జేమ్స్ ఈ అవార్డును గెలుచుకున్నాడు. ఈ సినిమాకు ఎడ్వర్డ్ బర్గర్ దర్శకత్వం వహించాడు, ఈ విభాగంలో బర్డో (ఫాల్స్ క్రోనికల్ ఆప్ ఎ హాండ్ఫుల్ ఆఫ్ ట్రూత్స్), ఎల్విస్(మాండీ వాకర్), ఎంపైర్ ఆఫ్ లైట్(రోజర్ డీకిన్స్), తార్(ఫ్లోరియాన్ హాఫ్మిస్టర్)లు పోటీ పడగా.. జేమ్స్ ఫ్రెండ్ బెస్ట్ సినిమాటోగ్రాఫర్‌గా ఆస్కార్ అందుకున్నాడు. గతేడాది సెప్టెంబర్‌లో రిలీజైన ఈ వార్ డ్రామా మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.