Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : భారత్, ఆస్ట్రేలియా మధ్య అహ్మాదాబాద్‌లో జరుగుతున్న నాలుగవ టెస్టు డ్రా దిశగా వెళ్తోంది. ఇవాళ అయిదు రోజు భోజన విరామ సమయానికి ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 73 రన్స్ చేసింది. ఆ జట్టు ఇంకా 18 పరుగులు వెనకబడి ఉంది. ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్, లబుషేన్‌లు ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. హెడ్ 45, లబుషేన్ 22 రన్స్‌తో ఆడుతున్నారు. ఇండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 571 రన్స్ చేసిన విషయం తెలిసిందే.