Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : 'నాటు నాటు' పాటకు ఆస్కార్ వరించడం పట్ల రామ్‌చరణ్ ఆనందం వ్యక్తం చేశారు. 'ఆర్ఆర్ఆర్' టీమ్ మొత్తానికి ధన్యవాదాలు చెబుతూ ఆయన ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. మరోసారి తారక్‌తో డ్యాన్స్ చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. అలాగే, ఈ అవార్డు భారతీయ నటీనటులందరి సొంతమని అన్నారు. 'మా జీవితాల్లోనే కాకుండా భారతీయ చలన చిత్ర చరిత్రలో 'ఆర్ఆర్ఆర్' ఎంతో ప్రత్యేకమైనది. 'ఆస్కార్' అవార్డు సొంతమయ్యేలా చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నేనింకా కలలోనే ఉన్న భావన కలుగుతోంది. రాజమౌళి, కీరవాణి.. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అత్యంత విలువైన రత్నాలు. 'ఆర్ఆర్ఆర్' వంటి మాస్టర్‌పీస్‌లో నన్ను భాగం చేసిన వారిద్దరికీ ధన్యవాదాలు. ప్రపంచవ్యాప్తంగా 'నాటు నాటు' అనేది ఒక భావోద్వేగం. ఆ ఎమోషన్‌కు రూపమిచ్చిన గేయరచయిత చంద్రబోస్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, కొరియోగ్రాఫర్ ప్రేమ్‌రక్షిత్‌కు ధన్యవాదాలు. నా బ్రదర్ ఎన్టీఆర్, కో-స్టార్ అలియాభట్‌కు ధన్యవాదాలు. తారక్.. నీతో మళ్లీ డ్యాన్స్ చేసి రికార్డ్స్ క్రియేట్ చేయాలని ఆశపడుతున్నా. భారతీయ నటీనటులందరికీ ఈ అవార్డు సొంతం. మాకు ఎంతగానో సపోర్ట్ అందించిన అభిమానులందరికీ నా కృతజ్ఞతలు' అని రామ్‌చరణ్ పేర్కొన్నారు.