Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు గెలుపొందిన సందర్భంగా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి , మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, రచయిత చంద్రబోస్ అండ్ టీంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆస్కార్స్ లో భారతీయ సినీ పరిశ్రమ తరపున టాలీవుడ్ నుంచి మొదటిసారి అవార్డు అందుకున్న తొలి సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలిచిన అరుదైన సందర్భాన్ని పురస్కరించుకుని ఓ సందేశాన్ని అందరితో పంచుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి.
ఆస్కార్స్ లో అవార్డు అందుకున్న తొలి భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ నిలవడం అద్భుతమైన విషయం. మ్యూజికల్ జీనియస్ ఎంఎం కీరవాణి, పాటల రచయిత చంద్రబోస్, సింగర్స్ కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, అద్భుతంగా డ్యాన్స్ చేసిన తారక్, రాంచరణ్‌కు శుభాకాంక్షలు. ఇలాంటి అద్భుతమైన అవకాశం రావడానికి కారణం వన్ మ్యాన్ ఎస్ ఎస్ రాజమౌళి. ఆయన ప్రతీ భారతీయుడు గర్వపడేలా చేశారు. ఆస్కార్స్ లో బెస్ట్ షార్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్‌గా అవార్డు అందుకున్న ది ఎలిఫెంట్ విస్పరర్స్ టీంకు శుభాకాంక్షలు. మీరంతా కలిసి చరిత్ర సృష్టించారు..అని వీడియో సందేశాన్ని ట్వీట్ చేశాడు చిరు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళాశంకర్‌లో నటిస్తున్నాడు. కీర్తిసురేశ్ ఇందులో చిరంజీవి సోదరి పాత్రలో నటిస్తోంది. చిరంజీవి తాజా లుక్ చూస్తుంటే భోళాశంకర్ షూటింగ్లో ఉన్నట్టు తెలుస్తోంది.