Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
అహ్మదాబాద్ వేధికగా జరిగిన టెస్టు డ్రాగా ముగిసింది. తొలి రెండు టెస్టుల్లో గెలిచిన టీమిండియా మూడో టెస్టులో ఓడినా 2-1 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది. మొట్టమొదటిసారిగా వరుసగా నాలుగు సార్లు బోర్డర్ గవాస్కర్ గెలిచిన జట్టుగా టీమిండియా నిలిచింది. ఇప్పటికే మూడో టెస్టు గెలిచిన ఆస్ట్రేలియా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోగా న్యూజిలాండ్ చేతుల్లో శ్రీలంక ఓడిపోవడంతో టీమిండియా కూడా ఫైనల్ కు అర్హత సాధించింది. ఈ తరుణంలో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కి ఇండియా-ఆసీస్ జట్లు అర్హత సాధించాయి. ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ లో టైటిల్ ఫైట్ లో పాల్గొంటాయి. ఇంగ్లాండ్ లో ది ఓవల్ లో జూన్ 7 టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.