Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘోర రోడ్డు ప్రమాదం
నవతెలంగాణ - డిచ్ పల్లి
జాతీయ రహదారి రక్తసితమైంది ముందు నుంచి వెళ్తున్న రారా వాహనం ను వెనుక వైపు నుండి అతివేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో కార్లో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండలంలోని చంద్రయాన్ పల్లి గ్రామ శివారులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. డిచ్పల్లి సిఐ మోహన్ తెలిపిన వివరాలు ప్రకారం మహారాష్ట్రలోని కొండల్ వాడికి చెందిన నిరడి గణేష్(28), ఆయన సోదరుడు నిరడి ఆదిత్య(25) అదే గ్రామానికి చెందిన మరో స్నేహితులు ప్రకాష్( 28) గత కొంతకాలంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నివాసముంటున్నారు. నిరడి గణేష్ జిల్లా కేంద్రంలో మొబైల్ షాప్ నిర్వహిస్తున్నారు.
దుకాణానికి కావాల్సిన సామగ్రి కోసం జిల్లా కేంద్రంలోని దుబ్బా ప్రాంతానికి చెందిన సాయిరాం (27) తో కలిసి నలుగురు యువకులు ఆదివారం కామారెడ్డి వైపు పనిమీద కారులో వెళ్లారు. పని ముగించుకుని తిరిగి వస్తుండగా నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని చంద్రయన్ పల్లి 44వ జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళుతూన్న భారీ మల్టీ ఎక్స్ఎల్ పుల్లర్ లారీని వెనుక నుంచి కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాద సమయంలో కారును నిరడి గణేష్ నడుపుతున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా భారీ లారీని రహదారిపై నడిపి తన నలుగురు మృతికి కారణమైన లారీ డ్రైవర పై చర్యలు తీసుకోవాలని మృతుడు గణేష్ తండ్రి నిరడి హన్మాండ్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ మోహన్ తెలిపారు.
ఘటన స్థలాన్ని పరిశీలించిన ఏసిపి..
చంద్రయాన్ పల్లి గ్రామ సమీపన అర్థరాత్రి చోటు చేసుకున్న రోడ్డు ప్రమాద విషయం తెలుసుకున్న నిజామాబాద్ ఏసిపి కిరణ్ కుమార్ సీఐ మోహన్ డిచ్పల్లి ఎస్సై కచకాల గణేష్ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకొని కారులో ఇరుక్కున్న మృతదేహాలను టోల్ ప్లాజా నుండి రప్పించి మృతదేహాలను బయటికి తీయించారు. కారు వేగంగా ఢీకొనడంతో కారులో ఉన్నవారు ఇరుక్కున్నట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అర్ధ రాత్రి ఘటన స్థలానికి చేరుకున్నారు టోల్ ప్లాజా సిబ్బందితో కలిసి సాయక చర్యలు చేపట్టి అర్థరాత్రి మృతదేహాలను ప్రమాదానికి కారణమైన కారు ట్రాలర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు సంబంధికులకు సమాచారం అందజేశారు. రహదారి రక్తం శక్తం కావడంతో అందరూ 30ఏళ్ల లోపు వారే ఉండడంతో కుటుంబ సభ్యుల రోధనాలను మెంటల్ ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోపే రహదారిని పోలీసులు క్లియర్ చేశారు.