Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మాజీ సీబీఐ డైరెక్టర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కే విజయరామారావు మంగళవారం సాయంత్రం మరణించారు. 1991-96 మధ్య దేశ ప్రధానిగా పీవీ నర్సింహారావు హయాంలో సీబీఐ డైరెక్టర్‌గా పని చేసి రిటైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన విజయరామారావు తదుపరి టీడీపీ అధినేత నారా చంద్రబాబు పట్ల స్ఫూర్తి పొంది 1999 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. నాటి ఎన్నికల్లో అప్పటి సీఎల్పీ నేత, కాంగ్రెస్ అభ్యర్థి పీ జనార్ధన్ రెడ్డిపై విజయరామారావు విజయం సాధించారు. తర్వాత రాష్ట్ర మంత్రిగానూ పని చేశారు.
2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన విజయరామారావు తర్వాతీ కాలంలో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్లో చేరారు.