Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - విశాఖపట్నం: ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్‌కి మరో భారీ కాంట్రాక్టు దక్కింది. నౌకాదళానికి చెందిన జలాంతర్గామి రీఫిట్ కాంట్రాక్టును రక్షణ మంత్రిత్వ శాఖ హెచ్ఎస్ఎల్కి అప్పగించింది. ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందంతో ఆత్మ నిర్భర్ భారత్ సాధనలో మరో కీలక అడుగు పడినట్టయింది. నౌకాదళంలో ఉన్న డీజిల్ ఎలక్ట్రిక్ మూడో సబ్ మెరైన్ సింధుకీర్తి. దీనిని సాధారణ రీఫిట్‌ను చేసేందుకు రూ.934 కోట్ల రూపాయిల విలువైన ఆర్ధర్‌ను షిప్ యార్డ్‌కి అప్పగించారు. రీఫిట్ ద్వారా ప్రత్యామ్నాయ మరమ్మతుల వ్యవస్థ అభివృద్ధి అవుతుంది. నిర్దేశిత కాలం పని చేసిన తర్వాత రీఫిట్ చేయడం ద్వారా వాటి పని సామర్థ్యం తగ్గకుండా, మరింత సమర్థంగా వ్యవస్థలన్నీ మెరుగ్గా నిరంతరాయంగా పనిచేసేందుకు వీలవుతుంది. ఇందులో దాదాపు 20కి పైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల సేవలను హెచ్ఎస్ఎల్ వినియోగించుకోనుంది. మీడియం రీఫిట్ లైఫ్ సర్టిఫికేషన్‌ను హెచ్ఎస్ఎల్ అందించనుంది. వెయ్యి రోజుల పని దినాలను ఉపాధి కల్పనను ఈ ప్రాజెక్టు సమయంలో చిన్న మధ్య, సూక్ష్మ తరహా పరిశ్రమలకు దక్కనుంది.