Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. టీఎస్పీఎస్సీ ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. అసిస్టెంట్ ఇంజినీరింగ్ పరీక్ష కూడా లీకైందని గుర్తించామని, దాంతో పాటు గతంలో నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను ఏమైనా లీక్ చేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాస్తవానికి మొదట టీఎస్పీఎస్సీ సర్వర్ హ్యాకింగ్‌కు గురై ప్రశ్నపత్రాలు లీకైనట్లు అధికారులు భావించారు. ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. టీఎస్పీఎస్సీలో పనిచేస్తున్న అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్, ఔట్ సోర్సింగ్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ రాజశేఖర్‌రెడ్డి ప్రశ్నాపత్రాలను దొంగిలించినట్లుగా గుర్తించారు. రేణుక, ఆమె భర్త ఢాక్యా నాయక్‌లతో కుదిరిన ఒప్పందం మేరకు ప్రశ్నపత్రాలను దొంగిలించారని, వీరిని నలుగురు వ్యక్తులు వాటిని కొనుగోలు చేసినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. ఇందులో వ్యవహారంలో తొమ్మిది మందిని అరెస్టు చేశామని, రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు.