Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - విజయవాడ
విజయవాడలో హజ్‌హౌస్‌కు భూమి కేటాయించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల రక్షణ కోసం కార్యాచరణ చేపడతామని సీఎం హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం అంజద్ బాషా నేతృత్వంలో ముస్లిం సంఘాల పెద్దలు సోమవారం జగన్‌ను కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో 2 గంటలపాటు చర్చలు జరిపారు. అన్ని మతాల భూముల పరిరక్షణకు జిల్లా స్థాయిలో కమిటీల ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. ఖాజీల పదవీకాలాన్ని 3 నుంచి 10 ఏళ్లకు పెంచాలని జగన్ ఆదేశించారు. సయ్యద్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆయన అంగీకారం తెలిపారు. కర్నూలు ఉర్దూ వర్సిటీ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్దేశించారు. చట్టసభల్లో ముస్లిం మైనార్టీలకు రాజకీయ పదవులిచ్చిన ఘనత సీఎం జగన్‌దేనని సమావేశం అనంతరం ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా పేర్కొన్నారు.